Advertisement

  • తెలంగాణలో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో వర్షాలు

తెలంగాణలో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో వర్షాలు

By: chandrasekar Wed, 17 June 2020 7:22 PM

తెలంగాణలో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో వర్షాలు


తెలంగాణలో ఇప్పటికే చల్లటి వాతావరణం అలుముకుంది. ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న ప్రజలకు హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం మరో తీపికబురును అందించింది. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఒకరు వెల్లడించారు.ఇప్పటికే రాష్ట్రమంతా వ్యాపించి ఉన్న నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లుగా చెప్పారు. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల్లో 5.8 కిలో మీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉపరిత ఆవర్తనం ఏర్పడిందని వివరించారు.

ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో జూన్‌ 19న ఓ అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. ఇప్పటికే వ్యాపించిన రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో మంగళవారం నిజామాబాద్‌, ములుగు, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమరంభీం, భద్రాద్రి, కొత్తగూడెం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఒకటి రెండు చోట్ల మాత్రం పెద్ద వానలు పడతాయని వివరించారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని పశ్చిమభాగం, తూర్పు మధ్యప్రదేశ్‌లోనూ వానలు పడతాయని చెప్పారు. ఆ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించారు.

Tags :
|
|
|

Advertisement