Advertisement

  • హైదరాబాద్ లో మళ్ళీ మొదలయిన వర్షం .... తీవ్ర ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్ లో మళ్ళీ మొదలయిన వర్షం .... తీవ్ర ఆందోళనలో ప్రజలు

By: Sankar Tue, 20 Oct 2020 07:46 AM

హైదరాబాద్ లో మళ్ళీ మొదలయిన వర్షం .... తీవ్ర ఆందోళనలో ప్రజలు


హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లిలో వాన పడుతోంది. చార్మినార్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్టలో మోస్తరు వర్షం కురుస్తోంది.

దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, బడంగ్‌పేట్, మీర్‌పేట్‌లో వర్షం పడడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ముంపు నుంచి పలు శివారు కాలనీలు ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే కురిచిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీలు, ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు తూర్పు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మంగళవారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంతంలో 45 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లు వేగంతో ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags :

Advertisement