Advertisement

  • వాళ్ళు అలా పిలుస్తుంటే షోలే సినిమాలో జై , వీరు అనే ఫీలింగ్ కలిగేది..సురేష్ రైనా

వాళ్ళు అలా పిలుస్తుంటే షోలే సినిమాలో జై , వీరు అనే ఫీలింగ్ కలిగేది..సురేష్ రైనా

By: Sankar Wed, 19 Aug 2020 4:22 PM

వాళ్ళు అలా పిలుస్తుంటే షోలే సినిమాలో జై , వీరు అనే ఫీలింగ్ కలిగేది..సురేష్ రైనా


ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా చెన్నై అభిమానుల మీద తన ప్రేమను వ్యక్తపరిచారు..ఐపీయల్ ప్రారంభ సీజన్లో నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపునే బరిలోకి దిగుతున్న ధోని , రైనా లకు తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది..ముద్దుగా తమిళనాడు అభిమానులు ధోని ని తల అని , రైనా ను చిన్న తల అని అంటారు..తమిళ్ లో తల అంటే పెద్దన్న అని అర్థం..చిన్న తల అంటే చిన్నన్న అని అర్థం..

ఈ ముద్దు పేర్లపై సురేష్‌ రైనా స్పందిస్తూ .. ధోనీని, తనను తల, చిన్న తల అని పిలిచినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు. 1975లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘షోలే’లో అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర పోషించిన పాత్రలు జై, వీరూ మాదిరి ధోనీ, తాను కూడా మంచి స్నేహితుల్లా ఉన్నామనే ఫీలింగ్‌ కలుగుతుందన్నారు.

వారి పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. మేము తొలుత దక్షిణాది వైపు వెళ్లినప్పుడు మాపై చాలా బాధ్యత ఉండేది. మా ఆటతో వారిని మెప్పిస్తామో లేదో అని భయపడ్డాం. కానీ దక్షిణాది ప్రజలు మా ఆటను ఆస్వాదించారు. దానికి కారణం మా ఫ్యాన్సే. వాళ్లు మాకు చాలా మద్దతుగా నిలిచారు. చాలా స్వేచ్ఛను ఇచ్చారు. వారి ప్రేమ, మద్దతుతోనే ఐపీఎల్‌లో రానించగలిగాం. ధోనీని, నన్ను తాల, చిన్న తాల అని చెన్నై ఫ్యాన్స్‌ పిలిస్తే.. షోలే సినిమాలో జై, వీరులాంటి వాళ్లమనే ఫీలింగ్‌ కలిగేది. వారిచ్చిన ముద్దు పేరు, చూపించిన ప్రేమ, మద్దతును జీవితాంతం మర్చిపోలేను’అని రైనా చెప్పుకొచ్చారు.

Tags :
|
|
|
|
|

Advertisement