Advertisement

  • రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు రోజులు వర్షాలు పడే అవకాశం..

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు రోజులు వర్షాలు పడే అవకాశం..

By: Sankar Sun, 30 Aug 2020 09:22 AM

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు రోజులు వర్షాలు పడే అవకాశం..


ఉత్తర మధ్యప్రదేశ్‌ మధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమెరిన్‌ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు నడుస్తోంది. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోసాంధ్ర, రాయలసీమల్లో వచ్చే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శనివారం పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. అనేక చోట్ల ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి..

ఇక మరోవైపు వీటి ప్రభా‌వంతో తెలంగాణ రాష్ట్రం‌లోని చాలా‌చోట్ల ఈరోజు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్ల‌డించింది. రేపు అక్క‌డ‌క్కడ వర్షం కురిసే అవ‌కాశం ఉన్నట్లు తెలిపింది. ఈరోజు గ్రేట‌ర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురు‌వొ‌చ్చని పేర్కొన్న‌ది.

Tags :
|

Advertisement