Advertisement

రైల్వే ప్రయాణీకులకు షాక్...!

By: Anji Tue, 29 Sept 2020 09:28 AM

రైల్వే ప్రయాణీకులకు షాక్...!

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న పలు రైల్వేస్టేషన్లలో ప్రయాణీకుల నుంచి టికెట్ ధరలపై కనిష్టంగా రూ. 10 నుంచి గరిష్టంగా రూ. 35 వరకు అదనపు రుసుమును వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

త్వరలోనే దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు పంపించనుందని సమాచారం. ప్రయాణీకులు కొనుగోలు చేసే టికెట్ తరగతి బట్టి ఈ అదనపు రుసుమును విధించనున్నట్లు తెలుస్తోంది. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులపై రూ. 35 అదనపు రుసుము పడే అవకాశముంది.

దేశంలో సుమారు ఏడు వేల రైల్వే స్టేషన్లు ఉండగా.. అందులో 700-1000 స్టేషన్ల నుంచి ప్రయాణించే వారిపై ఈ భారం పడనుంది. కాగా, గతంలోనే రైల్వేశాఖ ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన, రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్లలో అదనపు రుసుమును వసూలు చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement