Advertisement

  • బుకింగ్స్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం

బుకింగ్స్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం

By: chandrasekar Sat, 30 May 2020 11:45 AM

బుకింగ్స్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం


రైల్వే ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా అందుకే రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను పొడిగించింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను 120 రోజులకు పొడిగిస్తూ ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ట్రైన్స్‌కు ఇది వర్తిస్తుంది. మే 12 నుంచి తిరుగుతున్న 30 ట్రైన్స్, అలాగే జూన్ 1 నుంచి నడవనున్న మరో 200 కొత్త ట్రైన్స్‌ను అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ గడువు పెంపు నిర్ణయం వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

railways,key,decision,on bookings,people ,బుకింగ్స్‌పై, రైల్వే మంత్రిత్వ శాఖ, కీలక, నిర్ణయం, అడ్వాన్స్


అలాగే ఈ ట్రైన్స్ అన్నింటిలోనూ పార్సిల్, లగేజ్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం మే 31 నుంచి అమలులోకి వస్తుంది. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులు జూన్ 1 నుంచి తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సర్వీసులు కూడా పొందొచ్చు. అంటే ట్రైన్ జర్నీ చేసే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లను జర్నీకి ఒకరోజు ముందు బుక్ చేసుకోవలసి ఉంటుంది. అంటే జూన్ 1న ట్రైన్ జర్నీ చేయాలని భావిస్తే.. అప్పుడు మే 31న టికెట్లు బుక్ చేసుకోవాలి. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లకు ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఏసీ టికెట్లను ఉదయం 10 నుంచే బుకింగ్ ప్రారంభం కానున్నది.

Tags :
|

Advertisement