Advertisement

  • సనత్‌నగర్‌లో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి

సనత్‌నగర్‌లో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి

By: chandrasekar Wed, 29 July 2020 5:26 PM

సనత్‌నగర్‌లో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి


సనత్‌నగర్‌ సారిశ్రామికవాడ మీదుగా బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా వరకు వాహనాల రాకపోకలకు సులువైన మార్గం. ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తరువాత గ్రేటర్‌ పరిధిలోని ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆలోచనల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సనత్‌నగర్‌, పారిశ్రామికవాడల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాఫిక్‌ కష్టాలను ఊహించని విధంగా తగ్గుముఖం పట్టించే చక్కటి మార్గాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

సనత్‌నగర్‌లోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణ పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్‌ ప్రాంత ప్రజలు నర్సాపూర్‌ చౌరస్తా, జీడిమెట్లకు వెళ్లాలన్నా, జీడిమెట్ల నుంచి సనత్‌నగర్‌ వైపునకు రావాలన్నా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీదుగా సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ ఆర్‌యూబీ నిర్మాణంతో కేవలం 1.8 కిలో మీటర్లు ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దూరభారం తగ్గడమే కాకుండా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గనుంది.

గడిచిన 30 ఏండ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న సనత్‌నగర్‌ ప్రాంత వాసులు ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి తలసాని మే 15న మేయర్‌ బొంతు రాంమోహన్‌, హెచ్‌ఆర్‌డీ, రైల్వే అధికారులతో కలిసి ఆర్‌యూబీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌యూబీ నిర్మాణ ప్రాధాన్యాన్ని మంత్రి తలసాని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆర్‌యూబీ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే హెచ్‌ఆర్‌డీ అధికారులు రైల్వే అధికారులకు రూ.89.70 లక్షలు చెల్లించారు.

ప్రస్తుతం రెండు లేన్‌లుగా ఉన్న ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని సుమారు 400 మీటర్లు మేర రూ.45.04 కోట్లతో నాలుగు లేన్‌లుగా విస్తరించే నిర్మాణ పనులనూ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇందులో రూ.36 లక్షలను హెచ్‌ఆర్‌డీ అధికారులు రైల్వే అధికారులకు చెల్లించారు. అప్పటి ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా నిర్మించిన ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ప్రస్తుతం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు లేన్లుగా ఈ బ్రిడ్జిని విస్తరించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవచ్చన్న భావనలో ఉన్న ప్రభుత్వం ఈ పనులకు పూనుకుంది.

ఇది సనత్‌నగర్‌ నివాసితుల దీర్ఘకాలిక కోరిక. 1999-2004 మధ్య కాలంలో స్థానిక బీజేపీ నాయకులు కొందరు ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే కారణాలేవైనా ఈ పనులు ఊహించిన స్థాయిలో ముందుకు కదలలేదు. ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తరువాత గ్రేటర్‌ పరిధిలోని ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆలోచనల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సనత్‌నగర్‌, పారిశ్రామికవాడల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాఫిక్‌ కష్టాలను ఊహించని విధంగా తగ్గుముఖం పట్టించే చక్కటి మార్గాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

ఈ మేరకు తన హామీ నిలబెట్టుకునేందుకు వీలైన ప్రతి సందర్భంలో మంత్రి కేటీఆర్‌ మొదలు పురపాలక శాఖ ఉన్నతాధికారులు సనత్‌నగర్‌ ఎప్పుడు వచ్చినా ఈ రెండు పారిశ్రామికవాడల మధ్య ఆర్‌యూబీ లేదా ఫ్లై ఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనలను ముందుకు తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు మంత్రి తలసాని ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం ఈ రెండు పారిశ్రామికవాడల మధ్య ఆర్‌యూబీ నిర్మాణానికి పురపాలక మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయబోతుండడంతో ఇకపై ట్రాఫిక్‌ నరకయాతనలకు దూరంగా కేవలం రెండు లేదా మూడు నిమిషాల్లో సునాయాసంగా బాలానగర్‌కు చేరుకునే అవకాశం దక్కింది. ఇది సనత్‌నగర్‌ నివాసితుల్లో ఆనందోత్సాహాలను నింపింది.

Tags :

Advertisement