Advertisement

  • 1.40 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ

1.40 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ

By: Sankar Mon, 07 Sept 2020 08:04 AM

1.40  లక్షల ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ


దాదాపు ఏడాదిన్నరగా ఎప్పుడెప్పుడా అని దేశంలో ఉన్న నిరుద్యోగులు ఎదురు చూస్తున్న రోజు వచ్చింది..దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే రైల్వే ఎగ్జామ్స్ యొక్క స్టేజి 1 పరీక్షలు ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయో రైల్వే బోర్డు ప్రకటించింది..

దేశవ్యాప్తంగా లక్షా 40వేల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్‌ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. మూడు విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఈ ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. దాదాపు 2 కోట్ల 40 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. అయితే, అభ్యర్థులందరికీ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని రైల్వే బోర్డ్ తెలిపింది.

ఇక, మొత్తానికి వచ్చేఏడాది 1.40 లక్షల ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది రైల్వేశాఖ. కరోనా ఎఫెక్ట్‌తో లక్షలాదిమంది నిరుద్యోగులుగా మరగా.. కోట్లాదిమంది ఉపాధి కోల్పోగా... రైల్వేశాఖ ప్రకటన ఊరట కల్పించేదిగా చెప్పుకోవాలి.

Tags :
|

Advertisement