Advertisement

  • రైల్వే ప్రయాణికులకు షాకివ్వనున్న రైల్వే శాఖ..

రైల్వే ప్రయాణికులకు షాకివ్వనున్న రైల్వే శాఖ..

By: Sankar Tue, 29 Sept 2020 10:29 AM

రైల్వే ప్రయాణికులకు షాకివ్వనున్న రైల్వే శాఖ..


రైల్వే ప్రయాణికులకు రైల్వే బోర్డు షాకివనున్నట్లు తెలుస్తుంది..దేశంలో రైల్వే ప్రయాణికులకు ఛార్జీలకు పెరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి..అయితే, ఈ చార్జీలను రైల్వే టిక్కెట్ పై కాకుండా, యూజర్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధం అవుతున్నది.

అయితే ఈ యూజర్ చార్జీలు అందరికి వర్తించవని తెలుస్తోంది. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది లేదా పాత స్టేషన్లు ఆధునీకరించి వాటిల్లో మాత్రమే యూజర్ చార్జీలను వసూలు చేయబోతున్నారు. రైల్లో ప్రయాణం చేసే తరగతిని బట్టి రూ.10 నుంచి రూ.35 వరకు యూజర్ చార్జీలు ఉంటాయి. దేశంలో ఉన్న 7వేల రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం కోసమే ఈ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 7వేల స్టేషన్లలో 1000కి పైగా స్టేషన్లు ఆధునీకరించారు. ఈ స్టేషన్లో లో ఎక్కే ప్రయాణికులకు మాత్రమే యూజర్ చార్జీలు టికెట్ తో కలిపి వసూలు చేస్తారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి యూజర్ చార్జీలు ఎప్పుడూ వసూలు చేయలేదు.

కేవలం ఎయిర్ పోర్ట్ లలో మాత్రమే వసూలు చేసేవారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే ఇలాంటి చార్జీలు వసూలు చేయబోతున్నారు. రైల్వేశాఖ దీనికి సంబంధిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

Tags :

Advertisement