Advertisement

  • అస్సాంలో విషాదం ..పట్టాలు దాటుతున్న ఏనుగులను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన గూడ్స్ రైలు

అస్సాంలో విషాదం ..పట్టాలు దాటుతున్న ఏనుగులను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన గూడ్స్ రైలు

By: Sankar Thu, 22 Oct 2020 09:16 AM

అస్సాంలో విషాదం ..పట్టాలు దాటుతున్న ఏనుగులను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన గూడ్స్ రైలు


అస్సాంలోని గుహవతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..రైలు వస్తున్న విషయం తెలుసుకొని రెండు ఏనుగులు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఆ రెండిటిని బలంగా ఢీకొట్టింది..ఇంషులో ఒకటి తల్లి ఏనుగు కాగా ఇంకొకటి ఆ తల్లి ఏనుగు పిల్ల .. ఆ రెండు ఏనుగులు మృత్యువాత పడిన ఈ ఘటనలో గూడ్సు రైలు ఇంజన్‌ను‌ సీజ్‌ చేశారు అస్సాం అటవీ శాఖ అధికారులు.

వివరాల్లోకి వెళితే.. గత సెప్టెంబర్‌ 27న అస్సాం లుండింగ్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌‌ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతున్న 35 ఏళ్ల ఓ ఏనుగును దాని పిల్లను నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వేకు చెందిన ఓ గూడ్సు రైలు ఢీకొంది. దీంతో తల్లి ఏనుగు పైకి ఎగిరి పక్కకు పడిపోయింది. పిల్ల ఏనుగు పట్టాలపై పడిపోగా.. రైలు దాన్ని ఒక కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది. ఆ రెండు ఏనుగుల మృత్యువాతపై అస్సాం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో అతి వేగంగా వెళ్ల కూడదన్న నిబంధనలను సదరు రైలు అతిక్రమించిందని అటవీ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా గత మంగళవారం నాడు గువహతి బామునిమైదాన్‌ రైల్వే యార్డ్‌లో సదరు రైలు ఇంజన్‌ను సీజ్‌ చేశారు. దాని ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్‌ చేశారు.

దానిపై కేసు నమోదు చేసిన తర్వాత రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై స్పందించిన నార్త్ ‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే ‘‘ రైలు ఇంజన్‌ను సీజ్‌ చేయటం ఇది మొదటి సారేమీ కాదు. విచారణలో భాగంగా ఇంజన్‌ను సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆ రైలు ఇంజన్‌ వాడకంలోనే ఉంద’’ని తెలిపారు.

Tags :
|

Advertisement