Advertisement

  • టి ట్వంటీల్లో రోహిత్ జంటగా రాహుల్ ఉండాలి ..ఆకాష్ చోప్రా

టి ట్వంటీల్లో రోహిత్ జంటగా రాహుల్ ఉండాలి ..ఆకాష్ చోప్రా

By: Sankar Tue, 23 June 2020 09:56 AM

టి ట్వంటీల్లో రోహిత్ జంటగా రాహుల్ ఉండాలి ..ఆకాష్ చోప్రా



లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో టీమిండియాకు ఓపెనర్లు అంటే టక్కున గురొచ్చే జోడి రోహిత్ -ధావన్ ..గత ఏడు సంవత్సరాలుగా అద్భుత బాగస్వామ్యాలతో ప్రపంచ క్రికెట్లో ఓపెనింగులో గట్టి ముద్ర వేశారు ..వన్ డౌన్ లో వచ్చే కోహ్లీతో కలిసి టీం ఇండియా చేసే పరుగులు , సెంచరీలలో సింహభాగం వీరివే ..అయితే గత కొంతకాలంగా ధావన్ అంతగా ఫామ్లో లేడు..ఒకవైపు గాయాలు , మరోవైపు ఫామ్ లేమి , ఇంకోవైపు కె యల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో ధావన్ ప్లేస్ ప్రశ్నార్ధకం అయింది ..వన్ డే ఫార్మాట్లో ఇప్పటికిప్పుడు ధావన్ ప్లేస్ కు వచ్చే ముప్పు ఏమిలేకున్నా టి ట్వంటీ లలో మాత్రం రాహుల్ ను ధావన్ స్థానంలో తీసుకోవాలని కొందరు మాజీలు డిమాండ్ చేస్తున్నారు ..

ఇదే విషయమే మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాట్లాడుతూ టీ20ల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్ కాంబినేషన్‌ శకం ముగిసిందని నేను అనుకోవట్లేదు. ధావన్ ఇప్పటికీ మెరుగ్గా క్రికెట్ ఆడుతున్నాడు. కాకపోతే.. రోహిత్, రాహుల్‌తో పోలిస్తే..? ప్రస్తుతం అతను కాస్త వెనుకబడి ఉన్నాడు. నా అంచనా ప్రకారం టీ20ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ ఓపెనింగ్ జోడీ. వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీని మార్చాల్సిన అవసరం లేదు. వన్డేల్లో రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలడు’’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

అయితే 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి చేతి వేలి గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్న శిఖర్ ధావన్.. ఆ తర్వాత మోకాలి గాయంతో కొన్ని సిరీస్‌లకి దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో రీఎంట్రీ ఇచ్చినా.. మళ్లీ పాత గాయాలు అతడి కెరీర్‌ని దెబ్బతీశాయి. దాంతో.. ధావన్ స్థానంలో అవకాశాలు దక్కించుకున్న కేఎల్ రాహుల్.. జట్టు అవసరాల మేరకు ఓపెనర్, నెం.3, నెం.5 స్థానాల్లో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపర్‌గానూ అదరగొట్టేశాడు.దీనితో ధావన్ కు ప్రత్యామ్నాయంగా రాహుల్ ను తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు..


Tags :
|
|
|

Advertisement