Advertisement

జీరో నుంచి హీరోగా మారిన రాహుల్ తేవాటియా..

By: Sankar Mon, 28 Sept 2020 11:16 AM

జీరో నుంచి హీరోగా మారిన రాహుల్ తేవాటియా..


రాహుల్ తేవాటియా ప్రస్తుతం ఐపీయల్ లో మారుమోగిపోతున్న పేరు ..నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో జీరో అయ్యేలా కనిపించిన రాహుల్ తేవాటియా అనూహ్యంగా సిక్సర్లతో చెలరేగి నమ్మశక్యం కానీ ఆటతీరుతో ఒక్క సారిగా హీరోగా మారిపోయాడు..

తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో తెవాతియా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు. అయితే శాంసన్‌ ఔటైన తర్వాత దూకుడు పెంచిన 27 ఏళ్ల తెవాతియా తన విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 45 పరుగులు చేసి కింగ్స్‌ పంజాబ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఏడు సిక్సర్లు బాది సత్తా చాటాడు.

ఈ విషయం గురించి తెవాతియా మాట్లాడుతూ.. ‘‘తొలి 20 బంతుల వంటి చెత్త బంతులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. నెట్స్‌లో చాలా బలంగా బంతిని బాదేవాడిని. అదే నమ్మకంతో బరిలోకి దిగాను. కానీ తొలి హిట్టింగ్‌ ఆడలేకపోయా. కానీ డగౌట్‌లో అందరూ నావైపే చూడటం గమనించాను. ఎందుకంటే నేను సిక్సర్లు కొట్టగలనని వాళ్లకు తెలుసు. ఆ తర్వాత అదే నిజమైంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌ఆర్‌, మూడు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది..

నిజానికి లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్‌ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ తెవాతియా హర్షం వ్యక్తం చేశాడు

Tags :

Advertisement