Advertisement

  • తన కుల వృత్తిని మర్చిపోని రాహుల్ సిప్లిగంజ్...

తన కుల వృత్తిని మర్చిపోని రాహుల్ సిప్లిగంజ్...

By: chandrasekar Wed, 02 Sept 2020 3:57 PM

తన కుల వృత్తిని మర్చిపోని రాహుల్ సిప్లిగంజ్...


ఎంత బిగ్ బాస్ విన్నర్ అయినా.. రాహుల్ గురించి తెలియని వాళ్లు చాలామంది బయట అనుకునే మాట.. బిగ్ బాస్ ఆట ఆడకుండానే అతనికి టైటిల్ ఇచ్చారు. కుండ బద్దలు కొట్టి తన వ్యక్తిత్వం గురించి ఎవరు ఏం అనుకున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు రాహుల్. నిజానికి బిగ్ బాస్‌లో రాహుల్‌ని చూపించిన విధానం వేరు. రియల్ లైఫ్‌లో రాహుల్ వేరు అని అతనితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేమాట. ఎలాంటి వారినైనా సార్ అని సంభోదించే రాహుల్ సెలబ్రిటీ హోదా అంటే అదెలా ఉంటుందని అంటాడు తప్ప తనో సెలబ్రిటీ అని ఎప్పుడూ కూడా యాటిట్యూడ్‌ను చూపించలేదు. బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన డబ్బుతో ఏం చేస్తావ్ అంటే బార్బర్ షాప్ పెడతా అని చెప్పి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు రాహుల్. ఎంత ఎత్తు ఎదిగినా తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదు. తన ప్రాంతం, కులం, వృత్తిని దాచుకోకుండా తన మాట తీరు బిహేవియర్‌లో ఓల్డ్ సిటీ కుర్రాడు బయట ఎలాగైతే ఉంటాడో రాహుల్ కూడా అలాగే ఉంటాడు.

సెలబ్రిటీ హోదా వచ్చాక చాలా మంది తన కులం, వృత్తి బయటపడకుండా చాలా జాగ్రత్త పడతారు. కాని తన క్షౌర వృత్తిని ఘనంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాడు రాహుల్. బిగ్ బాస్ షోలో కూడా ఇతర కంటెస్టెంట్స్‌కి హెయిర్ కట్ చేసిన రాహుల్.. తన కుల వృత్తిని ఘనంగా చాటాడు రాహుల్. టాలీవుడ్‌లో ఉన్న ఇతర సెలబ్రిటీలకు ఒకప్పుడు హెయిర్ కట్, ఫేషియల్ చేశా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి సంగీత దర్శకుడు కోటి కూడా ఒక కారణం అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కోటితో పాటు ఆ షో చూస్తున్న ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాడు రాహుల్ సిప్లిగంజ్. జీ తెలుగులో రీసెంట్‌గా ‘సరిగమప’ మ్యూజికల్ షో ఇటీవలే ప్రారంభమైంది. ఈ షోకు స్వరాల పుత్రుడు కోటి, చంద్రబోస్, ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో గెస్ట్‌గా వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కోటి స్వరపరిచిన పాటలన్నంటిని తన స్టైల్లో పాడి ఆయనకు డెడికేట్ చేశాడు. దీంతో జడ్జీ సీటు నుంచి లేచి వచ్చి మరీ రాహుల్‌ని అభినందించారు కోటీ.

రాహుల్ ఇప్పుడు నంబర్ వన్ స్టేజ్‌లో ఉన్నాడు.. అది సంపాదించడం అంత ఈజీ కాదు’ అంటూ రాహుల్ ఉద్దేశించి మాట్లాడారు కోటి. దీంతో తన గతం గుర్తు చేసుకున్న రాహుల్ ఎమోషన్ అయ్యారు. ‘ఇక్కడ ఉన్న వాళ్లకు చాలామందికి తెలియదు.. కోటి సార్‌కి హెయిర్ కట్, ఫేషియల్ కావాలంటే ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు హెయిర్ కట్ చేసి ఫేషియల్ చేసి వచ్చేవాడిని. ఆయనతో నాకు చాలా ఎమోషనల్ జర్నీ ఉంది.. నేను గల్లికా గణేష్ అనే ఆల్బమ్‌ను లాంచ్ చేయడానికి కోటి గారిని పిలిస్తే వచ్చాడని, ఆ క్షణంలో తన దగ్గర డబ్బులు కూడా లేవని, ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ఆ ఆల్బమ్ చేశానని రాహుల్ సిప్లిగంజ్ వివరించాడు. కోటి సార్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడూ మరిచిపోలేనని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కోటి గారు కూడా ఓ కారణమని, ఆయన లేకుంటే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదని రాహుల్ ఎమోషనల్ అయి కోటిని ఏడిపించేశాడు. తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ లేని సమయంలో ఆయన తనకు సపోర్ట్ చేశాడని కోటి గురించి రాహుల్ సిప్లిగంజ్ ఎంతో గొప్పగా చెప్పాడు.

దీంతో కోటి బాగా ఎమోషన్ అయ్యారు. భావోద్వేగంతో స్టేజ్ మీద నుంచి ఏడుస్తూనే కళ్లు నీళ్లు తుడుచుకుంటూ సీట్‌లోకి వెళ్లి కూర్చుని దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో రాహుల్ ఆయన దగ్గరకు వెళ్లి గట్టిగా కౌగిలించుకోవడం మోస్ట్ ఎమోషనల్‌గా సాగింది. బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యువ టాలెంటెండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇండిపెండెంట్ మ్యూజికల్ సాంగ్స్‌కి పెట్టింది పేరు. 2013 నుంచి 2019 వరకూ ‘మగజాతి’, ‘ఎందుకే’, గల్లీ కా గణేష్’, ‘ధావత్’, ‘హిజ్రా’ వంటి ఆల్బమ్ సాంగ్స్‌తో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాడు. ఇక సినిమాల్లో జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడా సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ దమ్ము, ఈగ, రచ్చ, రంగస్థలం తదితర చిత్రాల్లో పాటలు పాడాడు. అయితే 50 పైగా చిత్రాల్లో మ్యూజికల్ హిట్ సాంగ్స్ పాడినప్పటికీ రాహుల్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా మారిన తరువాత ఈయన ఇండియా లెవల్‌లో పాపులర్ అయ్యాడు.

Tags :
|

Advertisement