Advertisement

ఫేస్ బుక్ వైఖరిపై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ

By: Sankar Tue, 18 Aug 2020 4:37 PM

ఫేస్ బుక్ వైఖరిపై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ


విద్వేష కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేసేందుకు బీజేపీ నేతలను ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్‌ కథనం నేపథ్యంలో ఎఫ్‌బీ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాసిన లేఖను ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం షేర్‌ చేశారు.

ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించమని, దీనిపై ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలని లేఖను వెల్లడిస్తూ రాహుల్‌ పేర్కొన్నారు. హేట్‌ స్పీచ్‌ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్‌బుక్‌ దాసోహమైందని కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారుల పక్షపాత వైఖరిపై నిర్ధిష్ట కాలపరిమితితో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

హింసను ప్రేరేపించే విభజన వాద కంటెంట్‌ను అనుమతించేందుకు ఎఫ్‌బీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి పావులా మారారని ఈ లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆగస్ట్‌ 14న వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ సంతకంతో కూడిన కాంగ్రెస్‌ లేఖ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ వ్యవస్ధాపక నేతలు ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని, అయితే ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది

Tags :
|
|

Advertisement