Advertisement

  • లాక్ డౌన్ లో వలస కార్మికులు ఒక్కరు కూడా చనిపోలేదా ..కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్

లాక్ డౌన్ లో వలస కార్మికులు ఒక్కరు కూడా చనిపోలేదా ..కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్

By: Sankar Tue, 15 Sept 2020 2:49 PM

లాక్ డౌన్ లో వలస కార్మికులు ఒక్కరు కూడా చనిపోలేదా ..కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వలస కార్మికుల మరణాలకు సంబంధించి తమ దగ్గర లెక్కలు లేవని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం సమాధానం చెప్పడంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతమంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రశ్నించింది. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే, కాంగ్రెస్ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి సంతోష్‌ కుమార్ గంగ్వార్ సమాధానం ఇస్తూ తాము వలస కార్మికులకు సంబంధించి ఎలాంటి రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని చెప్పారు.

దాంతో మోడీ ప్రభుత్వ తీరుపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. 'మోదీ గవర్నమెంట్‌కు ఎంత మంది ఉద్యోగం కోల్పోయారో, ఎంత మంది చనిపోయారో తెలియదు. మీకు లెక్క తెలియదు అంటే ఎవరు చనిపోలేదని అర్థమా? ఎవరు ఉద్యోగం కోల్పోలేదని అనుకోవాలా? అని రాహుల్‌ ప్రశ్నించారు.

Tags :
|
|

Advertisement