Advertisement

  • హత్రాస్ ఘటన ...నిందితులకు శిక్ష పడేవరకు వదిలేది లేదు ..రాహుల్ గాంధీ

హత్రాస్ ఘటన ...నిందితులకు శిక్ష పడేవరకు వదిలేది లేదు ..రాహుల్ గాంధీ

By: Sankar Thu, 01 Oct 2020 3:28 PM

హత్రాస్ ఘటన ...నిందితులకు శిక్ష పడేవరకు వదిలేది లేదు ..రాహుల్ గాంధీ


యూపీలోని హాత్రాస్‌ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. సెప్టెంబర్‌ 14న కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లిన ఓ యువతి....నలుగురు యువకుల చేతిలో బలైంది. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. నిందితులకు బీజేపీ అండగా ఉందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

అంతేకాదు....సీఎం యోగిని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే.. ఘటనపై బాధితురాలు కుటుంబానికి అండగా ఉండటానికి కాంగ్రెస్‌ పార్టీ మరో అడుగు ముందుకేసింది. రాహుల్‌ గాంధీ, ప్రియాంక స్వయంగా ఇవాళ హత్రాస్‌కు ఉదయం 10 గంటలకు బయలుదేరారు. అయితే.. హత్రాస్‌కు సరిగ్గా 142 కిమీ దూరంలో పోలీసులు వారి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక కాలి నడకనే హత్రాస్‌ కు బయలు దేరారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా...నిందితులకు శిక్షపడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాహుల్‌ ప్రకచించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధించారు.

Tags :

Advertisement