Advertisement

గత పర్యటనలో పుజారా.. మరి ఈ సారి ఎవరో ...ద్రావిడ్

By: Sankar Fri, 11 Dec 2020 4:31 PM

గత పర్యటనలో పుజారా.. మరి ఈ సారి ఎవరో ...ద్రావిడ్


ఇండియా ఆస్ట్రేలియా మధ్య మరి కొద్దీ రోజులో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది..గత ఆసీస్ పర్యటనలో సంచలన ప్రదర్శనతో టీం ఇండియా సిరీస్ గెలుచుకుంది ..

అయితే అప్పుడు స్టార్ ఆటగాళ్లు అయిన వార్నర్ స్మిత్ జట్టులో లేకపోవడం టీం ఇండియాకు కలిసివచ్చింది అని పలువురు అభిప్రాయపడ్డారు ..అయితే ఈ సారి ఆస్ట్రేలియా జట్టు ఫుల్ స్క్వాడ్ తో బరిలోకి దిగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది...అయితే ఈ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో ఇండియా దిగ్గజ ఆటగాడు ద్రావిడ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు...

ఈసారి ఆసీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఎవరు చతేశ్వర్‌ పుజారా కానున్నారో చూడాలి. ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఆసీస్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. మూడు సెంచరీలు కలుపుకొని 521 పరుగులు సాధించాడు. మరి ఈసారి వేరే బ్యాట్స్‌మెన్‌ ఆ పరుగులు సాధిస్తారా లేక మళ్లీ పుజారానే దానిని రిపీట్‌ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

అదే విధంగా టీమిండియా బౌలింగ్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఐదు రోజుల్లో టీమిండియా బౌలర్లకు 20 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు.. బ్యాట్స్‌మన్లకు అలా వీలు పడదు. ప్రతీసారి ఒక సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌కు 500 పరుగులు చేయడం సాధ్యం కాదు. కానీ బ్యాట్స్‌మన్‌ లయ అందుకుంటే బౌలర్లకు మాత్రం కష్టమే' అంటూ ద్రవిడ్‌ తెలిపాడు.

Tags :
|

Advertisement