Advertisement

  • తొలి టెస్టులో మయాంక్ కు జోడిగా అతడు కష్టమే ..ఆకాష్ చోప్రా

తొలి టెస్టులో మయాంక్ కు జోడిగా అతడు కష్టమే ..ఆకాష్ చోప్రా

By: Sankar Wed, 16 Dec 2020 1:21 PM

తొలి టెస్టులో మయాంక్ కు జోడిగా అతడు కష్టమే ..ఆకాష్ చోప్రా


ఆస్ట్రేలియాతో రేపటి నుంచి టీం ఇండియా నాలుగు టెస్టుల సిరీస్ లో బరిలోకి దిగనుంది...ఒక్క ఓపెనింగ్ లో తప్ప మిగిలిన అన్ని విభాగాలలో టీమిండియాకు ఆటగాళ్లు సెట్ అయ్యారు...స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరం కావడంతో , రోహిత్ స్థానంలో మయాంక్ కు జోడిగా ఎవరిని పంపించాలి అనేదానిపై టీమిండియా మల్లగుల్లాలు పడుతుంది..

పృథ్వీ షా , శుబ్మం గిల్ రూపంలో ఇద్దరు యువ ఓపెనర్లు ఉన్నప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్ లలో అంతగా ఆకట్టుకోలేకపోయాఋ ..ఈ నేపథ్యంలో రాహుల్ ను ఓపెనర్ గా తొలి టెస్టులో బరిలోకి దింపాలని కొంతమంది మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు ...అయితే ఆకాష్ చోప్రా మాత్రం రాహుల్ కు ఓపెనర్ గా స్థానం దక్కడం కష్టమే అని అంటున్నాడు..

తొలి టెస్టుకి కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పరిగణించకండి. అతను ఇప్పటి వరకూ 36 టెస్టుల్లో 34.59 సగటుతో 2,006 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. గణాంకాలు బాగున్నాయి.కానీ చివరి పది ఇన్నింగ్స్ లలో అతడి ప్రదర్శన అత్యంత పేలవం అందుకే అతడు ఓపెనర్ గా వచ్చే అవకాశం లేదు అని చోప్రా అభిప్రాయపడ్డాడు..

Tags :
|

Advertisement