Advertisement

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చిన రహానే

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చిన రహానే

By: Sankar Thu, 31 Dec 2020 8:09 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చిన రహానే


ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టెస్టులో అద్భుత సెంచరీ తో రాణించిన టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు..ఈ ప్రదర్శనతో రహానే ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 10వ స్థానంలో నిలిచాడు.

ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మరో ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌ 5వ స్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అశ్విన్‌ రెండు స్థానాలు ఎగబాకి 793 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. భారత్‌ స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.

ఇక టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న స్మిత్‌ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. తొలి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన కోహ్లి 879 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో సెంచరీతో మెరిసిన విలియమ్సన్‌‌‌ టెస్టుల్లో 890 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించాడు.

Tags :
|
|

Advertisement