Advertisement

రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్

By: Sankar Mon, 28 Dec 2020 1:36 PM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్


గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో 12 శాతం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని, కానీ మహిళలపై వేధింపుల కేసులు మాత్రం 11 శాతం పెరిగాయని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ తెలిపారు.

దోపిడీలు, దొంగతనాల కేసుల్లోనూ 53 శాతం రికవరీ అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ యోదా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణలోనే తొలిసారిగా సీపీ మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ ఇయర్‌ ఎండింగ్‌ క్రైమ్‌ రివ్యూను వెల్లడించారు

రాచకొండలో మర్డర్ 52 , అత్యాచారాలు 323, కిడ్నాప్ 137 కేసులు నమోదు చేశామని కమిషనర్‌ పేర్కొన్నారు. దొంగతనం 1863, చీటింగ్ 1539, హత్యాయత్నాలు 116 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డయల్‌ 100కు రోజూ 1,66,181కు తక్కువ కాకుండా ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Tags :

Advertisement