Advertisement

  • ఉత్కంఠభరిత పోరులో కింగ్స్ ఎలెవన్ పై సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్..

ఉత్కంఠభరిత పోరులో కింగ్స్ ఎలెవన్ పై సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్..

By: Sankar Mon, 21 Sept 2020 09:37 AM

ఉత్కంఠభరిత పోరులో కింగ్స్ ఎలెవన్ పై సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీయల్ లో నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొదమ సింహలలాగా పోరాడాయి..మ్యాచ్ ఆసాంతం రెండు జట్లు గెలిచేలాగే అనిపించాయి..ఒకసారి కింగ్స్ ఎలెవన్ జట్టు దే విజయం అనుకుంటే అనూహ్యంగా ఢిల్లీ పుంజుకుంది..ఈ సరి ఢిల్లీ దే విజయం అనుకుంటే ఊహించని రీతిలో కింగ్స్ చెలరేగింది..దీనితో మ్యాచ్ కూడా ఎటు తేలకుండా టై గా ముగిసింది..అయితే సూపర్ ఓవర్లో మాత్రం తాను ఎందుకు గ్రేట్ బౌలర్ అనేది నిరూపిస్తూ ఢిల్లీ ఆటగాడు రబడా చెలరేగిపోయి కేవలం రెండు పరుగులే ఇచ్చాడు..దీనితో ఢిల్లీ సూపర్ ఓవర్లో సులభంగా విజయం సాధించింది..

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ టీమ్ మొదట్లో బాగానే ఆడింది. కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాక మెల్లగా వికెట్లు పడ్డాయి. మధ్యలో స్కోర్ నెమ్మదించింది. మొదటి నుంచి క్రీజ్‌లో నిలిచిన మయాంక్ అగర్వాల్ మెల్ల మెల్లగా కుదురుకున్నాడు. చివర్లో దుమ్ము దులిపాడు.

తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 59 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే స్కోర్ 157 వద్ద ఔటయ్యాడు. చివరి బంతికి ఒక్క రన్ కొడితే గెలిచే వేళ ఔట్ అయ్యాడు. లాంగ్ షాట్ ఫోర్ కొట్టాడు. కానీ, అది క్యాచ్ అయింది. అంతకు ముందు ఢిల్లీ ప్లేయర్ స్టొయినిస్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది.

వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ 19.4 ఓవర్లకు స్కోర్ సమం అయింది. రెండు బంతుల్లో ఒక రన్ కొట్టాల్సి ఉండగా, మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యాడు. ఫోర్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక బాల్‌లో ఒక రన్ కావాల్సి ఉండగా, జోర్డాన్ కొట్టిన బంతిని రబాడా క్యాచ్ పట్టాడు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయింది. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ బౌలర్ రబాడా బౌలింగ్ చేశాడు.

మూడు బంతుల్లోనే కేఎల్ రాహుల్, పూరన్‌ను ఔట్ చేశాడు. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సూపర్ ఓవర్ ఫినిష్ అయిపోయింది. ఇక కింగ్స్ లెవన్ పంజాబ్‌ తరఫున షమీ బౌలింగ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బరిలోకి దిగారు. మొదటి బాల్ డాట్ బాల్. రెండో బంతి వైడ్. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయం సాధించింది.


Tags :
|
|

Advertisement