Advertisement

క్విట్ ఇండియా ఉద్యమం

By: chandrasekar Fri, 14 Aug 2020 10:09 AM

క్విట్ ఇండియా ఉద్యమం

భారతీయులను రెండవ ప్రపంచ యుద్ధంలోకి పంపిచటానికి నిరసనగా భారతదేశ స్వాతంత్య్రానికి గాంధీ ఇచ్చిన పిలుపు నందుకుని 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమము ప్రారంభమైనది. యుద్ధం ప్రారంభమైన తరువాత 1939 సెక్టెంబరు మాసంలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ పక్ష కార్యనిర్వహణ సంఘ సమావేశాలలో ఫాసిజానికి వ్యతిరేకంగా షరతులతో కూడిన మద్ధతునిస్తూ కాంగ్రెస్ తీర్మానించింది. అందుకు ప్రతిఫలంగా కోరిన యుద్ధానంతర భారత స్వాతంత్య్రాన్నీ బ్రిటీష్ వారు త్రిరస్కరించటం జరిగింది.

1942 లో ఐరోపా, ఆగ్నేయ ఆసియాలో అనుకూలంగా లేనపుడు యుద్ధ పరిస్ధితులలో భారత ఉపకండం అన్యమస్కంగా యుద్ధంలో పాల్గొనటం, బ్రిటీష్ భారత సైన్యంలో, భారతీయులలో పెరిగిన అసంతృప్తి బ్రిటీష్ వారిని భారతదేశాన్ని బుజ్జగించేదుకు ప్రేరేపించాయి. యుద్ధానంతరం భారతీయులకు అధికార బదలాయింపుకు ప్రతిఫలంగా యుద్ధంలో భారతీయుల సంపూర్ణ మద్దత్తు కూడగట్టటానికి బ్రిటీష్ వారు క్రిప్స్ ఆధ్వర్యంలో రాయబార బృందాన్ని భారతదేశానికి పంపించటం జరిగింది. అయితే స్వపరిపాలనకు నిర్ధిష్ట సమయాన్ని సూచించలేకపోవటం, ఆధికార బదలాయింపుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేక పోవటంతో పరిమితమైన పాలనాధికారాన్ని మాత్రమే ఇవ్వజూపిన క్రిప్స్ రాయబారం భారత ఉధ్యమకారులకు ఆమోదయోగ్యంకాలేదు. దీనితో చర్చ విఫలమైనాయి.

quit,india,movement,british,fight ,క్విట్, ఇండియా, ఉద్యమం, భారత, ఉధ్యమకారులకు


కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటీషు ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో చేసిన సహాయాన్ని అడ్డంపెట్టుకుని బేరసారాలకి దించడమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం భారత ప్రజల కోరికలను ఆమోదించనట్లయితే దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. బొంబాయి లోని గొవలియ టాంక్ మైదానంలో (తరువాత క్రాంతి మైదానంగా మార్చబడినది) ఆగస్టు 8న సత్యాగ్రహంతో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద ఆయన నమ్మకానికి ఉదాహరణ. ఆ ఉపన్యాసంలో ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు.

quit,india,movement,british,fight ,క్విట్, ఇండియా, ఉద్యమం, భారత, ఉధ్యమకారులకు


అప్పటికే భారత-బర్మా సరిహద్దులలో జాపాన్ సైన్య పురోగతితో అప్రమత్తమైన ప్రభుత్వం గాంధీని అఘాకాన్ పాలెస్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని, జాతీయ నాయకత్వాన్ని అహ్మద్ నగర్ కోటలో బంధించింద. కాంగ్రెస్ ని నిషేధించటంతో పాటు గాంధీ గారి ఉపన్యాసం తరువాత 24 గంటల లోపే దాదాపు అందరు కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం నిర్బందించింది, వీరందరూ యుద్ధం సమయంలో జైలు జీవితం గడిపారు. దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రదర్శనలు అందోళనలు జరిగాయి. కార్మికులు పెద్దయెత్తున సమ్మె చేసారు. ఉద్యమంలో పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది. భారత విప్లవ సంఘాలు మిత్రరాజ్య సరఫరా వ్యవస్థలమీద బాంబు దాడులు చేశారు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు.

కాంగ్రెస్ ముస్లింలీగ్ వంటి ఇతర రాజకీయ శక్తుల మద్దత్తు పోందలేక పోయినప్పటికీ పెద్దయెత్తున ముస్లింల మద్దత్తు సంపాదించింది. బ్రిటష ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దేశ వ్యాప్తంగా లక్షమందికి పైగా జైళ్ళకు పంపింది. ప్రజాందోళన మీద లాఠీ దాడి చేయటంమే కాక అపరాధ రుసుమును విధించింది. త్వరలోనే ఉద్యమం నాయకత్వంలేని ఆందోళనగా మారి అనేక ప్రాంతీయ విప్లవ సంఘాల చేతులలోకి మళ్ళంది. గాంధీ గారి అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే 1943 వ సంవత్సరానికి క్విట్-ఇండియా ఉధ్యమం నీరసించింది.

Tags :
|
|

Advertisement