Advertisement

శీతాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్

By: chandrasekar Sat, 05 Sept 2020 1:08 PM

శీతాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్


లోక్‌స‌భ‌ సచివాలయం పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో క్వశ్చన్ అవర్ రద్దు తాత్కాలికమేనని స్పష్టంచేసింది. క‌రోనా మహమ్మారి విస్త‌ర‌ణ‌ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు ఎక్కువగా గ్యాలరీల్లో చేరకుండా నిరోధించడం కోసమే వర్షాకాల సమావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.

ఈ మేర‌కు లోక్‌స‌భ‌ సచివాలయం శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉంటుందని తెలిపింది. క్వశ్చన్ అవర్‌ను ఒకటి రెండు రోజులు నిర్వహించడానికి, ఏకంగా 18 రోజులపాటు నిర్వహించడానికి తేడా ఉందని లోక్‌స‌భ సెక్రటేరియ‌ట్‌ తెలిపింది.

ఈ మార్పు కేవలం వర్షాకాల సమావేశాల వరకు మాత్రమేనని, శీతాకాల సమావేశాల్లో మ‌ళ్లీ క్వశ్చన్ అవర్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. వర్షాకాల సమావేశాల్లో ప్రతిరోజు 160 అన్‌స్టార్డ్ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వ‌నుంద‌ని పేర్కొంది.

Tags :
|
|

Advertisement