Advertisement

  • మధ్యప్రదేశ్‌లో కొత్తజంట తో పాటు 100 మంది క్వారంటైన్‌

మధ్యప్రదేశ్‌లో కొత్తజంట తో పాటు 100 మంది క్వారంటైన్‌

By: chandrasekar Fri, 29 May 2020 5:17 PM

మధ్యప్రదేశ్‌లో కొత్తజంట తో పాటు 100 మంది క్వారంటైన్‌


పెండ్లి కొచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొత్త జంటతో సహా వంద మందిని క్వారంటైన్‌లోకి పంపించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు పోయిన వారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు.

quarantine,in,madhya pradesh,for,marriage ,మధ్యప్రదేశ్‌లో, కొత్తజంట, పాటు, మంది, క్వారంటైన్‌


జిల్లా సరిహద్దుల్లో అతనికి స్క్రీనింగ్‌ చేసిన అధికారులు వెళ్లేందుకు అనుమతించారు. ఆ వ్యక్తి ఈ నెల 26న తన మరదలి పెళ్లికి హాజరయ్యాడు. అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసిన అధికారులు వైరస్‌ సోకినట్లు మంగళవారం నిర్ధారణకు వచ్చారు.

అతడిని కలిసిన ప్రమైరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నామని, వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన 100 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని కలెక్టర్‌‌ సౌరభ్‌ సుమన్‌ చెప్పారు. అతనిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags :
|
|

Advertisement