Advertisement

  • ఖతార్ సర్కారు ఖతారీయేతర సిబ్బంది వేతనాలపై 30 శాతం కోత

ఖతార్ సర్కారు ఖతారీయేతర సిబ్బంది వేతనాలపై 30 శాతం కోత

By: chandrasekar Fri, 12 June 2020 10:58 AM

ఖతార్ సర్కారు ఖతారీయేతర సిబ్బంది వేతనాలపై  30 శాతం కోత


ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు ఖతార్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర దేశాలకు చెందిన వారి వేతనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కరోనా ప్రభావంతో అక్కడి ఆర్ధిక వ్యవస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఖతార్ సర్కారు ఖతారీయేతర సిబ్బంది వేతనాలపై 30 శాతం కోత విధించింది.

ఉద్యోగులకు జూన్ 1 నుంచి 30శాతం తగ్గించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో ఖతార్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొన్ని సంస్థల్లో వేతనాలు తగ్గించడంతోపాటు, ఉద్యోగులను తొలగించింది.

2019 మార్చి నుంచి 47,000 మంది విదేశీయులకు ఖతార్ ఎయిర్‌వేస్ ఉపాధి కల్పిస్తుండగా ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఖతార్ పెట్రోలియం విభాగం లో , ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో వీరి సంఖ్య ఎక్కువ. ఈ నిర్ణయంతో ఖతార్ లోని విదేశీ కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags :
|
|

Advertisement