Advertisement

బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ ప్రత్యక్షం ..

By: Sankar Sat, 25 July 2020 2:41 PM

బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ ప్రత్యక్షం ..



నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం ముందు కొండ చిలువ శనివారం కనిపించింది. అది పొడవుగా, ఉదర భాగం లావుగా ఉండడం గమనార్హం. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి శుభసూచకంగా భావించారు.

శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ కనిపించిందని నమస్కరించుకుంటున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోశారు. అనంతరం పూజలు కూడా చేశారు. ఆలయ సిబ్బందికి ఈ విషయం చేరవేయడంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆలయం లోనికి వచ్చి కొండ చిలువను బంధించి తీసుకెళ్లిపోయారు.

ఇటీవల కాలంలో ఇలా గుడిలో జంతువులు రావడం ఇది రెండో సారి , తొలుత హైద్రాబాద్ లోని బాలాజీ టెంపుల్ ఆవరణలో ఉన్న గుడి లోపలకి తాబేలు వచ్చిన విషయం తెలిసిందే ..అయితే ఇది శుభసూచకం అని ఆలయ పండితులు చెప్పి , తాబేలుకు కూడా పూజలు చేసారు ..

Tags :
|
|
|

Advertisement