Advertisement

  • నైతిక విలువలకు కట్టుబడ్డ వ్యక్తి పీవీ నరసింహారావు

నైతిక విలువలకు కట్టుబడ్డ వ్యక్తి పీవీ నరసింహారావు

By: chandrasekar Sat, 27 June 2020 1:12 PM

నైతిక విలువలకు కట్టుబడ్డ వ్యక్తి పీవీ నరసింహారావు


వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి.

కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో పీవీ వైఫల్యం ఏమీలేదు. వాస్తవానికి ఇందిరాగాంధీతో పీవీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇందిరాగాంధీ పీవీని ఎంతగానో నమ్మేది. ఆ నమ్మకంతోనే ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను ఇచ్చారు. ఎన్టీ రామారావును పదవి నుంచి దింపడాన్ని పీవీ వ్యతిరేకించారు. గుండె బాగాలేదని చికిత్సకోసం ఎన్టీఆర్‌ ఆమెరికాకు వెళితే ఇక్కడ ఈవిధంగా చేయడం కరెక్ట్‌ కాదన్నారు. ప్రస్తుతం వీళ్లు గెలువొచ్చు కానీ, తర్వాత ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.

ఆయన అన్న విధంగానే తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. రాజీవ్‌గాంధీ కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పీవీ తెలిపారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, సిద్ధ్దాంతపరంగా పార్టీ పరమైన వైరం ఉన్నా నైతిక విలువలకు కట్టుబడ్డ వ్యక్తి పీవీ. ఎన్టీఆర్‌తో పెద్ద సఖ్యత కూడా లేదు. కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పేవారు.

ఒకరకంగా చెప్పాలంటే హస్తినలో అధికారపీఠం అధిష్ఠించిన తొలి దక్షిణాది వ్యక్తి, తొలి తెలుగు వాడు, తెలంగాణ వాడు పీవీ నరసింహరావే. ఆయన రాజకీయ ఎదుగుదలలో అనేక విచిత్రమైన సంఘటలు ఎదురయ్యాయి. రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

వాస్తవానికి ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరు. రాజకీయాల నుంచి తప్పుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాలనుకునే సమయంలో అనుకోకుండా ప్రధానిగా అవకాశం వచ్చింది. ఆ సమయంలో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య జరగడంతో దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దేశం మొత్తం అభద్రతా భావంలోకి వెళ్లిపోయింది.

ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని, దేశాన్ని గట్కెక్కించే నాయకుని కోసం వెతుకుతున్న కాంగ్రెస్‌పార్టీకి పీవీ నరసింహారావు కనిపించారు. అజాతశత్రువుగా పేరుపొందిన పీవీ మాత్రమే ప్రధాని పదవికి సరైన వ్యక్తని భావించారు. అంతేకాకుండా అప్పటికే ఆయన హోం, విదేశాంగ, రక్షణతోపాటు పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన అనుభవం ఉంది.

అనుభవానికి తోడు అపర మేధాశక్తి ఆయన సొంతం. కాంగ్రెస్‌పార్టీ నుంచి పీఎంగా ఉండాలంటూ ఆయనకు పిలుపొచ్చింది. అది విని ఆయనే ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆయన ఢిల్లీ నుంచి తన మకాం హైదరాబాద్‌కు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్ని పుస్తకాలు, ఇతర సరంజామాను కూడా ఇక్కడికి పంపించారు. కాంగ్రెస్‌ పార్టీలో అప్పుడు నేను కూడా చురుగ్గా ఉండేవాడిని. ఆనాటి దృశ్యాలు ఇంకా నా కండ్ల ముందు కదలాడుతున్నాయి

Tags :
|
|

Advertisement