Advertisement

  • కరోనా తొలి వాక్సిన్ వచ్చేసింది ..ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

కరోనా తొలి వాక్సిన్ వచ్చేసింది ..ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

By: Sankar Tue, 11 Aug 2020 3:29 PM

కరోనా తొలి వాక్సిన్ వచ్చేసింది ..ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్



కరోనా మహమ్మారిపై పోరాటంలో రష్యా తొలి గుడ్ న్యూస్ చెప్పింది ..ముందు నుంచి అందరు అనుకుంటున్నట్లు గానే రష్యా నే తొలి వాక్సిన్ ను ప్రపంచానికి అందించింది ..ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు.

కాగా పుతిన్‌ తన ఇద్దరు కుమార్తెలకు వ్యాక్సిన్‌ వేయించినట్టు ప్రకటించారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. 1.2 లక్షల మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక పలు దేశాల్లో కరోనా వైరస్‌ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి

Tags :
|
|
|
|

Advertisement