Advertisement

  • సీబీఐ సాధారణ విచారణ సమ్మతిని రద్దు చేసిన పంజాబ్

సీబీఐ సాధారణ విచారణ సమ్మతిని రద్దు చేసిన పంజాబ్

By: chandrasekar Tue, 10 Nov 2020 09:52 AM

సీబీఐ సాధారణ విచారణ సమ్మతిని రద్దు చేసిన పంజాబ్


గత కొంత కాలంగా బీజేపీ యేతర రాష్ట్రాలు సీబీఐ సాధారణ విచారణ సమ్మతిని రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కోవలోకి పంజాబ్ కూడా చేరింది. సీబీఐ కేసుల విషయంలో పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసుల విచారణ విషయంలో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేస్తున్నట్టు పంజాబ్ సర్కార్ ప్రకటించింది.

ఇందువల్ల పంజాబ్ పరిధిలో విచారణ చేపట్టే సీబీఐ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే సీబీఐ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పంజాబ్ స్పష్టంచేసింది. దీంతో సీబీఐ ఎంట్రీకి నో చెప్పిన బీజేపీయేతర రాష్ట్రాల జాబితాలో పంజాబ్ కూడా చేరిపోయింది.

బీజేపీ యేతర రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ జార్ఖండ్, కేరళ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ సర్కార్ కూడా అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సీబీఐ విచారణను రద్దు చేస్తూ జీవో జారీచేశాయి.

గత ప్రభుత్వం ఏపీలోనూ సీబీఐ విచారణను రద్దు చేస్తూ జీవో జారీచేసినప్పటికీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతేడాది జూన్‌లో ఆ జీవోను రద్దు చేసి రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఏపీ ప్రభుత్వం సీబీఐ సాధారణ విచారణకు అనుమతినిచ్చింది.

Tags :
|
|

Advertisement