Advertisement

  • ఐపీల్ 2020 లో అదిరిపోయిన పంజాబ్ ప్లేయర్ పూరన్ ఫీల్డింగ్

ఐపీల్ 2020 లో అదిరిపోయిన పంజాబ్ ప్లేయర్ పూరన్ ఫీల్డింగ్

By: chandrasekar Mon, 28 Sept 2020 12:44 PM

ఐపీల్ 2020 లో అదిరిపోయిన పంజాబ్ ప్లేయర్ పూరన్ ఫీల్డింగ్


రాజస్థాన్ మరియు పంజాబ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అటు బాటింగ్ లోను ఇటు ఫీల్డింగ్ లోను చాలా ఆకట్టుకునేలా వునింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో సంజూ శాంసన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే కింగ్స్ బౌలర్ల మీద విరుచుకుపడుతున్నాడు. అలాంటి సమయంలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటి బంతికి సింగల్ తీసి స్ట్రైకింగ్ సంజూ శాంసన్‌కు ఇచ్చాడు.

పరుగులతో అలరిస్తున్న సంజు బాటింగ్ స్థానంలో నిలవడంతో అశ్విన్ వేసిన రెండో బంతిని సంజూ శాంసన్ భారీ షాట్ ఆడాడు. అయితే, ఆ భారీ షాట్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టాడు పంజాబ్ ఫీల్డర్ పూరన్. అయితే, అది బౌండరీ దాటిన తర్వాత గాల్లో ఆ క్యాచ్ పట్టాడు. ఆ వెంటనే ఆ బంతిని మళ్లీ ఫీల్డ్‌లోకి విసిరేశాడు. ఆ ఫీల్డింగ్‌ను చూడాల్సిందే కానీ, ఎంతైనా వివరించలేము.

కష్టపడి డైవ్ చేసి పట్టిన ఆ బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ తర్వాత బాల్‌కే సిక్స్ కొట్టాడు సంజూ శాంసన్. ఆ రకంగా అక్కడ కవర్ చేశాడనుకోవచ్చు. కానీ, ఓ భారీ సిక్స్‌ను పూరన్ సేవ్ చేసిన విధానం మాత్రం క్రికెట్ లవర్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అతను డైవ్ చేసి సేవ్ ఆ బాలును ఆపడంతో అట్టే అక్కట్టుకున్నాడు.

Tags :
|
|
|

Advertisement