Advertisement

  • రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికి ఉంటుంది..పంజాబ్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికి ఉంటుంది..పంజాబ్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

By: Sankar Mon, 21 Dec 2020 5:17 PM

రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికి ఉంటుంది..పంజాబ్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టక మీద దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే...ఢిల్లీ సరిహద్దులలో రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు..కార్పొరేట్ సంస్థలకు ఆ చట్టాలు అనుకూలంగా ఉన్నాయని వాటిని రద్దు చేయాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు...

అయితే పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్‌ఎస్‌పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్‌ ఖట్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్‌ ఆదివారం మాట్లాడారు. ‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్‌ఎస్‌పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్‌ఎస్‌పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement