Advertisement

  • నీటి పంపకాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం

నీటి పంపకాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం

By: chandrasekar Wed, 19 Aug 2020 09:52 AM

నీటి పంపకాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం


నీటి పంపకాల పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యాణాతో నీటి పంపకాల అంశంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి గట్టి హెచ్చరికలు పంపారు. సట్లేజ్‌ - యమునా లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండంలా మారుతుందని అమరీందర్‌‌ సింగ్‌ హెచ్చరించారు.

హర్యాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని అయన వ్యాఖ్యానించారు. మంగళవారం, ఆగస్టు 18 న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ మరియు హర్యాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశం తర్వాత హర్యాణా సీఎం ఖట్టర్‌ మాట్లాడుతూ లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తి కావాలనే వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్‌‌ సింగ్‌తో ఈ సమస్యపై మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ మరియు హర్యానాల మధ్య నెలకొన్న నీటి పంపకాలు త్వరగా ఒక కొలిక్కి రావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement