Advertisement

  • ఉచితంగా మాస్క్ లు ఇవ్వాలి ..స్వీట్ షాప్ యజమానులకు సూచించిన పంజాబ్ సీఎం

ఉచితంగా మాస్క్ లు ఇవ్వాలి ..స్వీట్ షాప్ యజమానులకు సూచించిన పంజాబ్ సీఎం

By: Sankar Wed, 29 July 2020 9:24 PM

ఉచితంగా మాస్క్ లు ఇవ్వాలి ..స్వీట్ షాప్ యజమానులకు సూచించిన పంజాబ్ సీఎం



రక్షాబంధన్‌ సందర్భంగా వినియోగదారులకు ఉచితంగా మాస్క్‌లు ఇవ్వాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం స్వీట్‌ షాప్‌ యజమానులకు సూచించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ఆగస్టు 2న స్వీట్‌ దుకాణాలు తెరిచేందుకు యజమానులకు ఇటీవల సీఎం అనుమతి ఇచ్చారు.

మాస్క్‌ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు, ప్రచారం కల్పించేందుకు స్వీట్ల కొనుగోలుతో ఒక జత మాస్క్‌లు ఉచితంగా ఇవ్వాలని ఆయా జిల్లాల్లోని స్వీట్ల దుకాణాల యజమానులకు సూచించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తూ, ఉల్లంఘిస్తే జరిమానా మొత్తాన్ని పెంచాలని సీఎం సూచించారు.

ప్రతి సందర్భంలో పంజాబ్‌లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం రూ.500 జరిమానా విధిస్తోంది. అయితే అనేక జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే మొత్తాన్ని మరింత పెంచవచ్చని సీఎం హెచ్చరించారు. బస్టాండ్లు, ఇతర వ్యూహాత్మక పాయింట్ల వద్ద మాస్క్‌ వెండింగ్‌ మిషన్లను ఏర్పాటు చేయాలని ఇటీవల ఆరోగ్యశాఖను ఆదేశించారు. అదనంగా, పేదలకు వారి రేషన్ కిట్లతో పాటు ఉచిత మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు

Tags :
|
|
|
|

Advertisement