Advertisement

  • పంజాబ్‌లోకల్తీ మ‌ద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయారు

పంజాబ్‌లోకల్తీ మ‌ద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయారు

By: chandrasekar Sat, 01 Aug 2020 10:31 AM

పంజాబ్‌లోకల్తీ మ‌ద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయారు


పంజాబ్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ మ‌ద్యం సేవించి 48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్‌స‌ర్‌, గురుదాస్‌పూర్‌, తార‌న్ త‌ర‌న్ ప్రాంతాల్లో ఇంకొందరు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జూన్ 29, 30 తేదీలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

కల్తీ మద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. 21 మంది మృతి ఘటనలపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు.

ఈ ఘటనలపై సీఎం అమరీందర్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ ఘ‌ట‌న‌ల‌పై జలంధర్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు చేపట్టారని, బాధ్యులైన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఆయన ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Tags :
|

Advertisement