Advertisement

  • ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్ ఉంటే కరోనా ముప్పును వెంటనే గుర్తించవచ్చు

ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్ ఉంటే కరోనా ముప్పును వెంటనే గుర్తించవచ్చు

By: Sankar Mon, 10 Aug 2020 11:49 AM

ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్ ఉంటే కరోనా ముప్పును వెంటనే గుర్తించవచ్చు



అసలే ఇది వర్షాకాలం సాధారణంగానే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే కాలం ..అయితే కరోనా మహమ్మారి విజృంభణతో ఏది కరోనా , ఏది మాములు జ్వరం అన్నది ప్రజలకు అర్థంకావడం లేదు ..ఇలాంటి పరిస్థితుల్లోనే రక్తం లో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసే ప్లస్ ఆక్సిమీటర్‌ కీలకంగా మారింది ..

ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్‌ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి. కరోనా వైరస్‌ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సిమీటర్‌ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సిమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది.

సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్‌ లెవల్‌ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్‌ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్‌.. ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా, ఎక్కువగా పెరిగినా ప్రమాదమని గుర్తించాలి. పల్స్‌ ఆక్సిమీటర్‌ ధర రూ.1,300 నుంచి రూ.ఐదువేల వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఈ పరికరం ఉపయోగపడిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో అవసరం ఉటుందని భావిస్తున్న వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్స్‌ ఆక్సిమీటర్లకు డిమాండ్‌ పెరిగింది.

Tags :
|

Advertisement