Advertisement

  • పబ్ జి లవర్స్ కు బిగ్ షాక్ ..ఇక నుంచి ఆ అవకాశం కూడా బంద్

పబ్ జి లవర్స్ కు బిగ్ షాక్ ..ఇక నుంచి ఆ అవకాశం కూడా బంద్

By: Sankar Fri, 30 Oct 2020 11:24 AM

పబ్ జి లవర్స్ కు బిగ్ షాక్ ..ఇక నుంచి ఆ అవకాశం కూడా బంద్


మొబైల్ గేమ్ పబ్‌జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ ఇకపై కనుమరుగు కానుంది. పబ్‌జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేసింది.ఈ మేరకు పబ్‌జీ ఫేస్ బుక్ పేజీలో అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచి{అక్టోబర్ 30 } నుంచి వినియోగదారులందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్‌జీ ని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా, భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తత తర్వాత చైనాకు చెందిన సోషల్ మీడియాతో యాప్‌లతో పాటు.. మరికొన్ని గేమింగ్ యాప్‌లపై కూడా భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

వీటిలో చైనాకు చెందిన యాప్‌లు ఎక్కువగా ఉండగా.. మరికొన్ని ఇతర దేశాలకు చెందినవి కూడా ఉన్నాయి.. అయితే, భారత్‌లో పబ్‌జీ లవర్స్ చాలా మందే ఉన్నారు... పబ్‌జీ ప్లేస్టోర్‌ నుంచి మాయమైన కొన్ని రోజులో మరో కొత్త తరహా గేమ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.

Tags :
|
|

Advertisement