Advertisement

  • చైనా మీద మరొక డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రకటించిన ఇండియా ..పబ్జి తో పాటు 118 యాప్స్ పై నిషేధం

చైనా మీద మరొక డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రకటించిన ఇండియా ..పబ్జి తో పాటు 118 యాప్స్ పై నిషేధం

By: Sankar Wed, 02 Sept 2020 8:33 PM

చైనా మీద మరొక డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్  ప్రకటించిన ఇండియా ..పబ్జి తో పాటు 118 యాప్స్ పై నిషేధం


చైనాపై ఇండియా మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. తొలుత టిక్ టాక్, హలో సహా 59 చైనీస్ యాప్‌ల‌పై నిషేధం విధించిన భారత్.. తాజాగా మరోసారి కొరడా ఝులిపించింది.

పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం విధించింది. పబ్జీ మొబైల్ నార్డిక్ మ్యాప్: లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వియ్‌చట్ వర్క్, వియ్‌చాట్ రీడింగ్, బైడూ, బైడూ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, మెసేజ్ లాక్, స్మార్ట్ యాప్ లాక్, యూ-డిక్షినరీ, వీపీఎన్ ఫర్ టిక్ టాక్ తదితర యాప్‌లు నిషేధిత యాప్‌ల జాబితాలో ఉన్నాయి..

తాజా చర్యతో భారత్ నిషేధించిన చైనీస్ మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది. గల్వాన్ లోయలో చైనా బలగాలతో ఘర్షణలు తలెత్తిన తర్వాత 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 49 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ యాప్‌లు యూజర్లకు తెలియకుండా వారి సమాచారాన్ని సేకరిస్తున్నాయని.. వాటిని భారత్ వెలుపల ఉన్న సర్వర్లకు తరలిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :
|
|
|
|
|

Advertisement