Advertisement

  • మరోసారి చైనా యాప్స్ బ్యాన్ దిశగా భారత్ ..ఈ సారి లిస్ట్ లో పబ్ జి , లూడో సహా మొత్తం 275 యాప్స్

మరోసారి చైనా యాప్స్ బ్యాన్ దిశగా భారత్ ..ఈ సారి లిస్ట్ లో పబ్ జి , లూడో సహా మొత్తం 275 యాప్స్

By: Sankar Mon, 27 July 2020 12:20 PM

మరోసారి చైనా యాప్స్ బ్యాన్ దిశగా భారత్ ..ఈ సారి లిస్ట్ లో పబ్ జి , లూడో సహా మొత్తం 275 యాప్స్



భారత చైనా మధ్య జరిగిన సరిహద్దు విషయంలో భారత్ ఇరవై మంది జవాన్లను కోల్పోయిన విషయం తెలిసిందే ..దీనితో చైనాకు చెందిన యాప్స్ , వస్తువులను బ్యాన్ చేయాలనీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి ..దీనితో భారత ప్రభుత్వం ప్రజల భద్రత దృష్ట్యా చైనాకు చెందిన కొన్ని యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది ..అందులోనూ అత్యంత పాపులర్ యాప్ అయినా టిక్ టాక్ ఒకటి ...

మల్లి ఇప్పుడు భారత ప్రభుత్వం పబ్ జి , లూడో తో సహా 275 యాప్‌ల‌పై భార‌త్ నిషేదం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. గాల్వ‌న్ లోయ‌ల్ భార‌త్-చైనా మ‌ధ్య ఉద్రిక్త‌లు నెల‌కొన్న‌ప్ప‌టి నుంచి చైనాకు చెందిన యాప్‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన నిఘా వ‌ర్గాలు ఇప్ప‌టికే టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్ స‌హా 59 యాప్‌ల‌ను నిషేదించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు కలిగేంచాలా మ‌రో 275 చైనా యాప్‌లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు..

నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తూ భార‌త వినియోగ‌దారుల డేటా త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్ప‌టికే దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్‌ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుద‌ల కానుంది. చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్ర‌భుత్వం ఏ స‌మాచారాన్ని కోరానా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చ‌ట్టంలో ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త్, స‌హా వివిధ దేశ వినియోగ‌దారుల‌ డేటాపై డ్రాగ‌న్ నియంత్ర‌ణ ఉండే ఆస్కారం ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. ఇప్ప‌టికే దీనిపై భార‌త్‌ను అనుస‌రించి చైనా యాప్‌ల‌ను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే

Tags :
|
|
|
|
|

Advertisement