Advertisement

  • శ్రీహరికోటలో షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌక

శ్రీహరికోటలో షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌక

By: chandrasekar Thu, 17 Dec 2020 4:57 PM

శ్రీహరికోటలో షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌక


శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌకను పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్ 25 గంటలపాటు సాగుతుంది. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే గురువారం సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సీఎంఎస్-01 మనదేశానికి చెందిన 42వ కమ్యూనికేషణ్ ఉపగ్రహం అవుతుంది. దీని బరువు 1410 కిలోలు. ఈ ప్రయోగంతో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవనున్నాయి.

మనదేశానికి చెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎస్‌డీఎస్‌సీ నుంచి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ 77వ లాంచ్ వెహికిల్ మిషన్. వాహన వివిధ దశల్లో ఇంధనాన్ని నింపే ఆపరేషన్ కొనసాగుతోందని షార్ అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 3.10 గంటల నుంచి ఈ ప్రయోగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Tags :
|
|

Advertisement