Advertisement

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ50 లాంచ్

By: Sankar Thu, 17 Dec 2020 08:54 AM

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ50 లాంచ్


సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

మంగళవారం మధ్యాహ్నం మిషన్‌ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రయోగానికి 25 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ ఎత్తులో, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టనున్నారు.

Tags :
|
|
|

Advertisement