Advertisement

  • అగ్రి బిల్లులు పాసైన తీరు ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం: ఆజాద్‌

అగ్రి బిల్లులు పాసైన తీరు ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం: ఆజాద్‌

By: chandrasekar Tue, 22 Sept 2020 8:26 PM

అగ్రి బిల్లులు పాసైన తీరు ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం: ఆజాద్‌


వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఆదివారం రోజున బిల్లుల‌ను అడ్డుకున్న 8 మంది విప‌క్ష ఎంపీల‌పై నిన్న వేటు వేశారు. వారంతా పార్ల‌మెంట్‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ కూడా స‌భ‌లో ర‌భ‌స కొన‌సాగింది. ప్ర‌తిప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ మాట్లాడుతూ.. గ‌త రెండు రోజుల నుంచి స‌భ‌లో జ‌రుగుతున్న దాని ప‌ట్ల ఎవ‌రూ సంతోషంగా లేర‌న్నారు.

స‌రిహ‌ద్దుల్లో పోరాటం త‌ర‌హాలో స‌భ‌లో ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోసం పోరాడుతామ‌న్నారు. త‌మ నేత‌ల అభిప్రాయాల వినాల‌ని ప్రజ‌లు భావిస్తార‌ని, కేవ‌లం 2 లేదా 3 నిమిషాల్లో ఎవ‌రూ పూర్తి అభిప్రాయాల‌ను తెలుప‌లేర‌న్నారు. మంది ఎంపీల‌పై విధించిన వేటును ఎత్తివేయాల‌ని, ప్రైవేటు వ్య‌క్తులు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే పంట కొనాల‌న్న బిల్లును తీసుకువ‌చ్చేంత వ‌ర‌కు విప‌క్షాలు స‌భ‌ను బ‌హిష్క‌రిస్తాయ‌ని ఆజాద్ తెలిపారు. రాజ్య‌స‌భ‌లో అగ్రి బిల్లులు పాసైన తీరు ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 18 పార్టీలు ఒక‌వైపు ఉండ‌గా, ఎన్‌డీఏ ఓ వైపు ఉన్న‌ద‌ని, ప్ర‌భుత్వం వ‌ద్ద సంఖ్య ఉందా లేదా అన్న విష‌యం త‌న‌కు స్ప‌ష్టంగా తెలియ‌ద‌ని ఆజాద్ పేర్కొన్నారు.

Tags :

Advertisement