Advertisement

హీరో విక్ర‌మ్ కు తాతగా ప్ర‌మోష‌న్

By: chandrasekar Thu, 12 Nov 2020 7:49 PM

హీరో విక్ర‌మ్ కు  తాతగా ప్ర‌మోష‌న్


ప్రముఖ తమిళ హీరో విక్ర‌మ్ కు తాతగా ప్ర‌మోష‌న్ వచ్చింది. త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ తాత ప్ర‌మోష‌న్ అందుకున్నాడు. విక్ర‌మ్ కూతురు అక్షిత పండంటి అమ్మాయికి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ ఇంట పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌ల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. తమిళ స్టార్ హీరో విక్రమ్ కూతురు అక్షిత, క‌రుణానిధి ముని మ‌న‌వ‌డు మ‌ను రంజిత్‌ల వివాహం 2017లో చెన్నైలో జ‌రిగింది. హీరో విక్రమ్ కి ఒక కొడుకు ఒక కూతురు వున్నారు.

అక్షిత మరియు రంజిత్‌ల వివాహం త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి స‌మ‌క్షంలో, చెన్నైలోని గోపాల‌పురంలో ఉన్న ఆయ‌న ఇంట్లోనే నిరాడంబరంగా జరగడం గమనార్హం. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అక్షిత-రంజిత్‌లు 2016 సంవత్సరంలో పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి రిసెప్ష‌న్‌ను చెన్నైలోని మేయర్ రామనాథన్ హాల్‌లో ఘ‌నంగా నిర్వ‌హించగా, ఈ వివాహ రిసెప్షన్‌కు కోలీవుడ్, తమిళ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Tags :
|
|

Advertisement