Advertisement

  • అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరని ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ జోస్యం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరని ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ జోస్యం

By: chandrasekar Sat, 15 Aug 2020 10:46 AM

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరని ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ జోస్యం


అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ చెప్పిన జోస్యం గత 40 ఏళ్లుగా నిజమవుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ చెప్పిన విషయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాకిచ్చేలా ఉన్నాయి.

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌ను ఓడిస్తారని అల్లన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గత 40 ఏళ్లుగా హిస్టరీ ప్రొఫెసర్ అంచనాలు తప్పలేదు. దీంతో రిపబ్లికన్స్‌లో కంగారు మొదలైంది. మరోవైపు ఫ్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ జోస్యం తమకు అనుకూలం కావడంతో డెమొక్రటిక్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లన్ లిచ్‌మన్ ధ్రువీకరించిన అభ్యర్థులందరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.

ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో విజమం తమదేనంటూ ధీమాగా ఉన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ విజయం సాధిస్తారని సైం ప్రొఫెసర్ లిచ్‌మన్ వేసిన అంచనా నిజమైంది. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్టోపస్‌గా పేరొందిన లిచ్‌మన్ అంచనాను సమర్ధించేవారే అధికం. తన 13 సూత్రాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ ఓటమి చెందుతారని జోస్యం చెప్పారు. ఇతని జోస్యం వాళ్ళ డెమొక్రటిక్ పార్టీ నేతలు చాలా ఆనందంగా వున్నారు. ఈ సారి అధ్యక్షుడుగా ఎన్నికవుతారో చూస్తాం.

Tags :

Advertisement