Advertisement

  • లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎక్కువ ఉపయోగించే ప్రొడక్ట్స్

లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎక్కువ ఉపయోగించే ప్రొడక్ట్స్

By: chandrasekar Mon, 10 Aug 2020 7:55 PM

లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎక్కువ ఉపయోగించే ప్రొడక్ట్స్


కరోనా సమయంలో ప్రజలు రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మూలికల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రజల్లో పరిశుభ్రత పెరిగింది. శుభ్రత పాటిస్తున్నారు. డాబర్ చవన్ ప్రాష్ సేల్స్ ఏప్రిల్ - జూన్ మధ్య 700 శాతం పెరిగాయి. తేనె విక్రయాలు 39 శాతం వృద్ధి చెందాయి. పతంజలి గ్రూప్‌కు సంబంధించిన ప్రొడక్టులు కూడా సేల్స్ భారీగా పెరిగాయి. బ్రేక్ ఫాస్ట్ సెరెల్స్, ఇన్ స్టంట్ నూడుల్స్, రైస్ సేల్స్ పెరిగాయి. మ్యాగీ, కిట్ కాట్, మంచ్ లాంటివి సేల్స్ కూడా వృద్ధి చెందాయి. పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ సేల్స్ బీభత్సంగా పెరిగాయి. రికార్డుస్థాయిలో పార్లే జీ బిస్కెట్ల విక్రయాలు పెరిగాయి. ప్రజలు, ఎన్జీవోలు పేదలకు బిస్కెట్ ప్యాకెట్లు పంచడానికి వీటినే ఎక్కువగా వినియోగించారు.

డిజిటల్ విషయానికొస్తే ఇళ్లలో ఉండే పిల్లల కోసం బైజూస్ యాప్‌ను బాగా వినియోగించారు. మూడింతలు ఎక్కువ డౌన్ లోడ్స్ అయ్యాయి. జీ 5 యాప్ డౌన్ లోడ్స్ 33 శాతం, నెట్ ఫ్లిక్స్ డౌన్ లోడ్స్ 45 శాతం పెరిగింది. ఆన్ లైన్ సేల్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్ లాప్ కోసం సెర్చ్ చేసిన వారి సంఖ్య పెరిగింది. బంగారం తాకట్టు పెట్టడం కూడా పెరిగింది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారు తమ దగ్గరున్న బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి సంస్థల్లో బంగారం రుణాలు పెట్టే వారి సంఖ్య పెరిగింది

Tags :
|

Advertisement