Advertisement

  • శంకర్ భారీ హిట్ చిత్రం జెంటిల్మెన్ కు సీక్వెల్ తీస్తున్నాం ...నిర్మాత కేటీ కుంజుమోన్‌ ప్రకటన

శంకర్ భారీ హిట్ చిత్రం జెంటిల్మెన్ కు సీక్వెల్ తీస్తున్నాం ...నిర్మాత కేటీ కుంజుమోన్‌ ప్రకటన

By: Sankar Fri, 11 Sept 2020 07:37 AM

శంకర్ భారీ హిట్ చిత్రం జెంటిల్మెన్ కు సీక్వెల్ తీస్తున్నాం ...నిర్మాత  కేటీ కుంజుమోన్‌  ప్రకటన


జెంటిల్మెన్ యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా , స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా..శంకర్ కి ఇది తన కెరీర్ లో తొలి సినిమా..అయినా కూడా శంకర్ జెంటిల్మెన్ సినిమా తీసిన విధానానికి అందరు ఆశ్చర్యపోయారు..సినిమా కూడా భారీ విజయం సాధించింది..ఆ సినిమాతో అర్జున్ కు భారీ ఫాలోయింగ్ వచ్చింది...కేటీ కుంజుమోన్‌ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. 1993లోవిడుదలయింది..

ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. ఈ సినిమా విడుదలైన 27ఏళ్లకు ‘జెంటిల్‌మేన్‌2’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మేన్‌’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనువదించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకుంది. తొలి భాగానికి రెండింతలు గొప్పగా ‘జెంటిల్‌మేన్‌ 2’ని తెరకెక్కించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తాం. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్‌మేన్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

Tags :
|

Advertisement