Advertisement

  • లోథీ స్టేట్ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

లోథీ స్టేట్ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

By: chandrasekar Fri, 31 July 2020 09:10 AM

లోథీ స్టేట్ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ


కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ జారీచేసిన నోటీసులు కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ తానుంటున్న ప్ర‌భుత్వ బంగ్లాను గురువారం ఖాళీ చేశారు. కేంద్రం ఇచ్చిన‌ గ‌డువుకు రెండు రోజుల ముందే ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. ప్రియాంక గ‌త 23 ఏళ్ల నుంచి ఢిల్లీలోని 35 లోథీ స్టేట్ బంగ్లాలో నివాస‌ముంటున్నారు. అయితే ఆమెకు ఇటీవ‌లే కేంద్ర హోంశాఖ ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించుకున్న విష‌యం విదిత‌మే.

కావున ఆ బంగ్లాను ఆగ‌స్టు ఒక‌టో తేదీ లోపు ఖాళీ చేయాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ జులై 1న నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో గ‌డువు కంటే రెండు రోజుల ముందే లోథి స్టేట్‌ను ఖాళీ చేశారు. ఆమె ఢిల్లీకి స‌మీపంలోని గురుగ్రామ్‌కు వెళ్తార‌ని స‌మాచారం. కానీ ఆ విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు.

ప్రియాంక నివసించిన బంగ్లాను కొద్దిరోజుల క్రితం రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ బలునీకి కేటాయించారు. దీంతో తాను బంగ్లాను ఖాళీ చేసే ముందు రెండు రోజుల క్రితం అనిల్ ను తేనీటి విందుకు ప్రియాంక ఆహ్వానించారు. ప్రియాంక ఆహ్వానంపై అనిల్ స్పందించారు.

తన‌కు ఇటీవ‌లే క్యాన్స‌ర్ చికిత్స జరిగింద‌ని, వైద్యులు ఇంట్లోనే ఉండ‌మ‌న్నార‌ని అనిల్ చెప్పారు. మీరే త‌మ ఇంటికి కుటుంబ స‌మేతంగా విందుకు రావాల‌ని ప్రియాంక‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆహ్వానించారు. ప్రియాంకా గాంధీ త‌న కుటుంబంతో 1997 నుంచి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు.

Tags :
|
|

Advertisement