Advertisement

  • ప్రియాంక గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశం

ప్రియాంక గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశం

By: chandrasekar Thu, 02 July 2020 7:29 PM

ప్రియాంక గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశం


కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్రం ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. అందుకోసం ఆగస్టు 1 వరకు ఆమెకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పరిధిలో లేనందున లోధీ రోడ్డులోని బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ బుధవారం ప్రియాంక గాంధీకి లేఖరాసింది.

కేవలం ఎస్పీజీ భద్రత ఉన్న వారికే ప్రభుత్వ బంగ్లా ఉంటుదని జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వారికి ఆ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది.

ఆగస్ట్‌ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది కేంద్రం. అంతేకాదు జూన్ 30 నాటికి ఆ ఇంటి కి సంబంధించి 3.43 లక్షల పెండిగ్ బిల్లులు ఉన్నాయని.. బంగ్లా ఖాళీ చేసేలోపు వాటిని చెల్లించాలని సూచించింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత ఉన్నందున 1997 ఫిబ్రవరిలో లోధి ఎస్టేట్‌లోని బంగ్లా నెం.35ని కేటాయించారు.

గత ఏడాది గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ తొలగించిన నేపథ్యంలో బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఐతే కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె భద్రతకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రియాంక గాంధీకి వెంటనే ఎస్పీజీ భద్రత కల్పించడంతో పాటు బంగ్లాను ఖాళీ చేయాలన్న నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నవంబరు 4న సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) భద్రతను తొలగించింది కేంద్రం.

గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని పలు నిఘా ఏజెన్సీలు వెల్లడించిన నేపథ్యంలో వారికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను ఉపసంహరించారు. ఎస్పీజీకి బదులుగా సి.ఆర్.పి.ఎఫ్ సిబ్బందితో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఆ తర్వాత కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం దేశ ప్రధానికి మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుంది. మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యకులకు కేంద్రం ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించింది.

Tags :
|
|

Advertisement