Advertisement

  • రెవెన్యూ అధికారుల లంచాల వేధింపుల పై కరపత్రాలు ముద్రణ

రెవెన్యూ అధికారుల లంచాల వేధింపుల పై కరపత్రాలు ముద్రణ

By: chandrasekar Thu, 30 July 2020 2:09 PM

రెవెన్యూ అధికారుల లంచాల వేధింపుల పై కరపత్రాలు ముద్రణ


రెవెన్యూ అధికారుల లంచాల వేధింపుల పై కరపత్రాలు ముద్రణ చేసి ఇంటింటికి పంచిన గుర్తుతెలియని వ్యక్తులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో కరోనా వైరస్ కంటే రెవిన్యూ లో వైరస్ ఇంకా ప్రమాదం అని అందులో నయాబ్ తాసిల్దార్ కమృద్దీన్ బాధితులం అంటూ మండలంలోని గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆరోపణలు చేస్తూ కరపత్రాలను ఇంటింటికి పంచడంతో గన్నేరువరం మండలంలో రెవెన్యూ అవినీతి బాగోతంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన ఆ సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా లంచాలకు అలవాటు పడిన రెవెన్యూ అధికారులు గత కొంత కాలంగా సామాన్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతులను వేధిస్తూ లంచాలు ఇస్తేనే పనీ చేస్తామని చెప్పే అధికారులపై విసుగెత్తిన రైతులు కరపత్రాలు ముద్రణ చేసి రెవెన్యూ అధికారుల పై ఉన్న ఆవేశాన్ని ఈ విధంగా ఇస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గన్నేరువరం పోలీసులు కరపత్రాల విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో సుమోటోగా కేసును స్వీకరించి రెవెన్యూ అధికారుల బాగోతాన్ని బయట పెట్టిన గుర్తుతెలియని వ్యక్తుల గురించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. లంచాలడిగిన అధికారులపై ప్రభుత్వం చర్య తీసికోవాలని ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు.

Tags :

Advertisement