Advertisement

  • సీ-ప్లేన్ సర్వీస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

సీ-ప్లేన్ సర్వీస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

By: chandrasekar Mon, 26 Oct 2020 5:13 PM

సీ-ప్లేన్ సర్వీస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ


పర్యాటక రంగంలో అభివృద్ధి పరచుట కోసం సీ-ప్లేన్ సర్వీస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం తెలుసుగా అక్కడి అహ్మదాబాద్‌లోని సబర్మతి నది నుంచి ఐక్యతా విగ్రహం వరకూ చక్కర్లు కొడుతూ నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సీ-ప్లేన్‌ను మాల్దీవులలోని మాలే నుంచి కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ విమానాన్ని ప్రారంభిస్తారు. రక్షణ విభాగం చెప్పిన వివరాల ప్రకారం ఈ సీ-ప్లేన్‌ను స్పైస్ జెట్ విమాన సంస్థ నడుపుతుంది. ఇది ట్విన్ ఒట్టెర్ 300 మోడల్ ఫ్లైట్. M/s స్పైస్ జెట్ టెక్నిక్ పేరుతో ఇది రిజిస్టర్ అయ్యింది. ఈ విమానం ద్వారా దేశ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అలాగే పౌర విమానయాన రంగంలో కూడా సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇండియాలో సీ-ప్లేన్స్ రావాలని ప్రధాన మంత్రి నరేంద్రమమోదీ కోరుకున్నారు. ఈ సీ-ప్లేన్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సర్వే, పరిశీలన, పర్యవేక్షణ కోసం దీన్ని నెమ్మదిగా నడిపితే 4 గంటలు ఎగరగలదు. అదే టూరిజం కోసం దీన్ని వేగంగా నడిపితే 2 గంటల ప్రయాణం తర్వాత దీనికి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది.

దేశంలో ఇలాంటి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మాలే నుంచి కోచి తీరానికి 750 ఏరియల్ కిలోమీటర్లు. అందుకే ఈ విమానం డైరెక్టుగా మాలే నుంచి గుజరాత్ రాలేదు. మధ్యమధ్యలో ఆగుతూ వచ్చింది. ఇందులో ఫ్యూయల్ 3 గంటలపాటూ ఎగిరేందుకు సరిపోతుంది. అహ్మదాబాద్ నుంచి కెవాడియాకు మొత్తం 8 ట్రిప్పులు ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి నాలుగు సార్లు విమాన సర్వీసులు ఉంటాయి. ఒకసారి ప్రయాణానికి టికెట్ ధర రూ.4800. మొత్తం 19 మందితో ఇది వెళ్లగలదు. ప్రయాణికుల కోసం ప్రతి సీ-ప్లేన్‌లో 14 సీట్లు ఉంటాయి. ఈ విమానాన్ని సాయంత్రం 6 తర్వాత వాడరు. ఇది 220 కిలోమీటర్ల ట్రిప్పును 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. టూరిజం పరంగా సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ విమానాన్ని తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని తెచ్చే ఆలోచన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలాంటి ప్లేన్లను విజయవాడలోని కృష్ణానదిలో ప్రారంభించాలనుకున్నారు. భవానీ ద్వీపాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఐతే అమరావతి ప్లాన్స్ లాగే ఇది కూడా అమల్లోకి రాలేదు. ఎన్నికల తర్వాత అమలుచేద్దామనుకున్న టీడీపీకి ఎన్నికల్లో ఓటమితో ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు గుజరాత్ లో దీనిని ప్రారంభించనున్నారు.

Tags :
|

Advertisement