Advertisement

  • భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉందన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ

భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉందన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ

By: chandrasekar Wed, 09 Sept 2020 09:14 AM

భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉందన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ


రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో ప‌త్రికా గేట్ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆవిష్క‌రించిన సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. భార‌త మీడియా ప్ర‌పంచ‌కీర‌ణ చెందాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. భార‌తీయ ఉత్ప‌త్తుల‌తోపాటు, భార‌త‌దేశ స్వ‌రం కూడా ప్ర‌పంచ‌వ్యాప్తం అవుతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా భార‌త్‌ను శ్ర‌ద్ధ‌గా గ‌మ‌నిస్తున్న‌ద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రికా గ్రూప్ చైర్మ‌న్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్త‌కాల‌ను ప్ర‌ధాని ఆవిష్క‌రించారు.

పుస్తక ఆవిష్కరణ అనంత‌రం ప్ర‌ధాని మాట్లాడుతూ ప్ర‌స్తుతం ప్ర‌తి అంత‌ర్జాతీయ సంస్థ‌లో భార‌త్ బ‌లమైన ఉనికిని క‌లిగి ఉన్న‌ద‌ని, అందువవ‌ల్ల భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. మ‌న ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్‌లు అంత‌ర్జాతీయ కీర్తిని సాధించుకోవాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగంలో మ‌నం డిజిట‌ల్‌గా ప్ర‌పంచంలోని ప్ర‌తి మూలను చేరాల్సిన అస‌వ‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. మీడియా లో చేస్తున్న సేవలు గురించి పొగిడారు.

భార‌తీయ సంస్థ‌లు కూడా ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇస్తున్న‌ట్లుగానే అద్భుత ర‌చ‌న‌ల‌కు సాహిత్య పుర‌స్కారాలు ఇవ్వాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హమ్మారి విష‌యంలో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగిస్తూనే, వివిధ ప్ర‌భుత్వ ప‌థకాల‌కు సంబంధించి వారిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తూ భార‌త మీడియా సంస్థ‌లు అందిస్తున్న సేవ‌లు అమోఘ‌మ‌ని ప్ర‌ధాని కొనియాడారు. భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు.


Tags :
|
|

Advertisement